ఈరోజు నుంచి కనీస వేతనాలు.. యాజమాన్యాలు కచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ఇవే!
భారతదేశం, జూన్ 1 -- తెలంగాణలోని కోట్లాది మంది శ్రామికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కార్మికులు, వేతన జీవుల కనీస వేతనాలను పెంచుతూ కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం(జూన్ 1) నుంచే ఈ కొత్త వేతనాలు అమలులోకి వస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థికంగా భారీ ప్రయోజనం చేకూరనుంది.
గతంలో వేర్వేరు షెడ్యూల్డు రంగాలకు వేర్వేరుగా ఉన్న వేతన విధానానికి స్వస్తి పలుకుతూ, అందరికీ సమాన న్యాయం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం 'ఏకీకృత నమూనా' (యూనిఫామ్ మోడల్) ప్రవేశపెట్టింది. ఈ కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా మరో 10 ఉపాధి రంగాలను చేర్చారు. తాజా చేరికలతో కలిపి కనీస వేతనాలు వర్తించే మొత్తం రంగాల సంఖ్య 77కి పెరిగింది.
కార్మికుల నివాస ప్రాంతాలు, నైపుణ్యాల ఆధారంగా కార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.