భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోకి వచ్చే వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు సామాజిక భద్రతను మరింత విస్తరించే దిశగా ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచుతూ కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

సరిగ్గా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ వేతన పరిమితిని సవరించడం గమనార్హం. గతంలో 2004 నుంచి 2014 వరకు ఈ పరిమితి ఎలాంటి మార్పు లేకుండా కొనసాగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2014లో దీనిని రూ.15,000గా నిర్దేశించారు. నాటి నుంచి పెరుగుతున్న ఆదాయాలు, మారిన ఆర్థిక పరిస్థితులు, అధికారిక ఉపాధి రంగా విస్తరణను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తాజాగా రూ...