భారతదేశం, జూన్ 29 -- పీఎఫ్ (ప్రొవిడెంట్ ఫండ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చే వార్త అందించింది. Employees' Provident Fund Organisation (EPFO) తన డిజిటల్ మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తూ తీసుకొచ్చిన కొత్త ప్లాట్‌ఫామ్ 'ఈపీఎఫ్ఓ 3.0' (EPFO 3.0) ద్వారా సేవలను మరింత వేగవంతం చేస్తోంది. ఇకపై పీఎఫ్ డబ్బులను డ్రా చేసుకోవడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. యూపీఐ యాప్‌లు, ప్రత్యేక ఏటీఎం కార్డుల ద్వారా క్షణాల్లో డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల కాగితపు పనులు (Paperwork) తగ్గడమే కాకుండా వేగంగా నిధులు అందుతాయి.

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రిటైర్మెంట్ బాడీ సేవలను క్రమబద్ధీకరించడానికి ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టం...