ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్న్యూస్: రూ. 15 వేల ప్రోత్సాహకం సాధించండిలా
భారతదేశం, అక్టోబర్ 20 -- సంఘటిత రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన' (PM-VBRY) పథకాన్ని అమలు చేస్తోంది. రూ.99,446 కోట్ల అంచనా వ్యయంతో 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు రెండేళ్ల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పొందే నూతన ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 వరకు నగదు ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాల్లోకి (DBT రూపంలో) జమ చేస్తున్నారు.
పీఎం-వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రభుత్వం రెండు ముఖ్య భాగాలుగా విభజించింది.
పార్ట్ A (ఉద్యోగులకు ప్రోత్సాహకం): మొదటిసారిగా ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని రూ.7,500 చొప్పున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.