భారతదేశం, అక్టోబర్ 20 -- సంఘటిత రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' (PM-VBRY) పథకాన్ని అమలు చేస్తోంది. రూ.99,446 కోట్ల అంచనా వ్యయంతో 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు రెండేళ్ల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పొందే నూతన ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 వరకు నగదు ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాల్లోకి (DBT రూపంలో) జమ చేస్తున్నారు.

పీఎం-వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రభుత్వం రెండు ముఖ్య భాగాలుగా విభజించింది.

పార్ట్ A (ఉద్యోగులకు ప్రోత్సాహకం): మొదటిసారిగా ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని రూ.7,500 చొప్పున...