భారతదేశం, నవంబర్ 28 -- దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అంతేకాకుండా ఇది మరింత బలపడి డిసెంబర్ 2వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచనలున్నాయి.

ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, వివిధ వాతావరణ నమూనాలు (మోడల్స్) అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ వాయుగుండం సముద్రంలోనే బలహీనపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు.

ఇవాళ (నవంబర్ 28, 2026) నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ...