భారతదేశం, జూలై 6 -- Tirumala Anivara Asthanam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన కొలువుల్లో ఈ ఆణివార ఆస్థానం అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో, కర్కాటక సంక్రాంతి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే, సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున ఈ కొలువును నిర్వహించడం వల్ల దీనికి 'ఆణివార ఆస్థానం' అనే పేరు వచ్చింది. దీనికి ఒక ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది.

పూర్వం మహంతులు శ్రీవారి దేవస్థాన పరిపాలనను స్వీకర...