ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం - కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే సూచనలు!
భారతదేశం, అక్టోబర్ 10 -- వాతారవణంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మళ్లీ ఏపీలో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ముఖ్యమైన వివరాలను పేర్కొంది.
ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. అది తీవ్ర రూపం దాల్చే సూచనలున్నాయని అంచనా వేసింది. ఈ ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకోనుందని వెల్లడించింది.
ఈ అల్పపీడన వ్యవస్థ తదుపరి 3 నుంచి 4 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ, ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు వేగంగా కదిలే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ అల్పపీడన తీవ్రతపై విభిన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బుధవారం నాటికి మరింత తీవ్రమై వాయుగుండం గా మారే అవకాశం ఉందని కొన్ని ప్రధాన వాతావర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.