భారతదేశం, అక్టోబర్ 26 -- తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి ఎదురవుతున్న సరిహద్దు అనుమతుల చిక్కుముడులను విప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అన్ముల రేవంత్ రెడ్డి ముంబై చేరుకున్నారు.

ఇవాళ ఉదయం ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గోదావరి నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల పొరుగున ఉన్న మహారాష్ట్ర భూభాగాల...