భారతదేశం, మే 30 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో భాగ్యం కుట్ర తెలిసి నర్మద తిడుతుంది. అసలు ఏ కుట్ర గురించి అంటున్నారు, ఏ విషయం తెలిసిందో చెప్పమని ఇడ్లీ బాబాయ్ అంటాడు. దాంతో ధీరజ్ ఒక్కటి లాగిపెడతాడు. చెప్పాలని లేకుంటే చెప్పకు. కానీ ఇలా కొడతావా అని ఇడ్లీ బాబాయ్ అంటే మరోటి కొడతాడు ధీరజ్.

మా అన్నయ్య మా నుంచి విడిపోయేలా చేసింది మీరే కదా. మా ఇల్లు ముక్కలు చేశారని ధీరజ్ అంటాడు. అయ్యో రామ అదంతా చేసింది నర్మద వాళ్ల నాన్న ప్రసాద్ రావు కదా. లాయర్‌ను తీసుకొచ్చి గొడవ చేసింది ఆయనే కదా అని భాగ్యం అంటుంది. ఆపుతావా. మీరు వెళ్లి మా నాన్నకు లేనిపోనివి నూరిపోయడం వల్లే అలా చేశారు. మీరు పెట్టిన మంట వల్లే ఇల్లు రెండుగా ముక్కలైందని నర్మద కోపంగా అంటుంది.

క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని భాగ్యంతో ఇడ్లీ బాబాయ్ అంటాడు....