భారతదేశం, జూన్ 8 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో లాకప్‌లో ఉన్న ధీరజ్‌కు భోజనం తీసుకెళ్తుంది ప్రేమ. ఎమోషనల్‌గా మాట్లాడుతుంది ప్రేమ. తినాలని లేదని ధీరజ్ అంటే.. తనకోసం తినమని ప్రేమ అంటుంది. ధీరజ్‌కు అన్నం తినిపిస్తుంది ప్రేమ.

నా మీద నీకు కోపంగా ఉందిగా. నన్ను పెళ్లి చేసుకున్నందుకేగా మా వాళ్లు నీ మీద ఇంత కోపంగా ఉన్నారని ప్రేమ అంటే.. నిన్ను పెళ్లి చేసుకున్నాకే నా లైఫ్ మారింది. నీకోసం ఇంత కంటే పెద్ద కష్టం ఎదురైనా సరే ఆనందంగా భరిస్తాను. ఇలాంటి మాటలు ఇంకోసారి మాత్రం మాట్లడకు. అది భరించలేను అని ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ప్రేమకు కూడా ధీరజ్ అన్నం తినిపిస్తాడు. నా మీద నీకున్న ప్రేమ నీకు వచ్చే కన్నీళ్లతో తెలుస్తుందని ఎమోషనల్‌గా చెప్పిన ధీరజ్ తర్వాత ప్రేమను నవ్విస్తాడు. మాములుగానే నీ మొహాన్ని చూ...