భారతదేశం, నవంబర్ 11 -- ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా జలవనరుల శాఖ కార్యకలాపాల్లో ఊహించని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల మనుగడ, పర్యవేక్షణపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీటి రంగంలో పారదర్శకత, స్వయంసమృద్ధి పెంచేందుకు సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

సాగునీటి శాఖ పరిధిలో వృథాగా ఉన్న వేలాది ఎకరాల భూములను ఆదాయ వనరుగా, పునరుత్పాదక ఇంధన కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రతి ఎకరా స్థలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల పరివ...