భారతదేశం, మార్చి 18 -- ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ఇజ్రాయెల్ హత్య చేసిన నేపథ్యంలో, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం ఏ ఒక్క వ్యక్తి మరణంతోనూ కుప్పకూలిపోయేంత బలహీనమైనది కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లారిజానీ మరణం ఇరాన్ నాయకత్వానికి తీరని లోటు కాదని, తమ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని పేర్కొన్నారు.
మంగళవారం రాత్రి టెహ్రాన్ శివార్లలోని పర్దిస్ జిల్లాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 67 ఏళ్ల అలీ లారిజానీ మరణించారు. తన కుమార్తెను కలిసేందుకు వెళ్లిన సమయంలో జరిగిన ఈ దాడిలో లారిజానీతో పాటు ఆయన కుమారుడు మొర్తేజా కూడా ప్రాణాలు కోల్పోయారు. లారిజానీ మరణాన్ని ఆయన నేతృత్వం వహించిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారికంగా ధృవీకరించింది.
లారిజానీ హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.