భారతదేశం, మే 19 -- మధ్యప్రాచ్యంలో యుద్ధం ముంచుకొస్తోందని భయపడిన ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన పెద్ద ఊరటనిచ్చింది. ఇరాన్‌పై మంగళవారం జరగాల్సిన సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న మిత్రదేశాల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే ఆసియా ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.01 డాలర్లు (2.7%) తగ్గి 109.09 డాలర్ల వద్దకు చేరింది. అటు అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) కూడా 1.38 డాలర్లు తగ్గి 107.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు సెషన్లలో ఇవి మే నెలలోనే గరిష్ట స్థాయిలను తాకాయి. యుద్ధం గనుక మొదలైతే సరఫరా నిలిచిపోయి ధ...