భారతదేశం, మార్చి 25 -- ముంబై/న్యూయార్క్: గత కొంతకాలంగా వరుస నష్టాలతో బెంబేలెత్తిస్తున్న పసిడి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య దౌత్యపరమైన చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆసియా ట్రేడింగ్ సమయంలో వెండి ధర ఏకంగా 7 శాతం పెరగగా, బంగారం 4 శాతం మేర లాభపడింది.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ (COMEX)లో బుధవారం బంగారం ధర సుమారు 4 శాతం పెరిగి ప్రతి ఔన్సు‌కు $4,600 వద్ద ట్రేడవుతోంది. అటు వెండి ధర మరింత వేగంగా పెరిగి 7 శాతం వృద్ధితో $74.42 వద్ద కొనసాగుతోంది. యుద్ధ మేఘాల మధ్య నిన్నటి వరకు కుదేలైన మార్కెట్లు, ఒక్కసారిగా చర్చల వార్తలు రావడంతో కోలుకున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను పూర్తిగా మార్చేసింది. హార్ముజ్ జలసంధ...