భారతదేశం, అక్టోబర్ 26 -- పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఇరాన్ వ్యవహారంలో తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలా లేక పూర్తిస్థాయి సైనిక చర్యలతో ముగింపు పలకాలా అనే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

"ఒప్పందం చేసుకుందామా లేక ఇరాన్ వ్యవహారాన్ని పూర్తిగా తుడిచిపెట్టేద్దామా అనే రెండు ప్రతిపాదనలే నా ముందున్నాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. మేము ఎలాంటి ఆటలూ ఆడటం లేదు" అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి పూర్తిగా తమ దళాల నియంత్రణలోనే ఉందన్నారు.

చమురు ధరల పెరుగుదలపై స్పందిస్తూ.. "పిచ్చివారి చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా చూడటానికి పెరిగే గ్యాస్ ధరలు ఒక చిన్న మూల్...