భారతదేశం, అక్టోబర్ 21 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Invest Telangana Global Summit 2026) ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు సంబంధించిన సన్నాహకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సమ్మిట్‌ ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు ఆయన కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరగనుంది. సమ్మిట్ ప్రాధాన్యతను ప్రపంచస్థాయిలో చాటిచెప్పేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు...