భారతదేశం, మార్చి 25 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల జాతరను జరుపుకున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిసింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 8 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ ఒక దశలో 1,200 పాయింట్లు (1.6%) ఎగబాకి 75,230 మార్కును తాకగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 400 పాయింట్లు లాభపడి 23,287 స్థాయికి చేరుకుంది.
కేవలం దిగ్గజ కంపెనీలే కాకుండా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్లు కూడా 2 శాతానికి పైగా లాభపడటం మార్కెట్లోని ఉత్సాహానికి నిదర్శనం. ఇంత భారీ స్థాయిలో మార్కెట్లు పెరగడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
మార్కెట్లలో జోరుకు ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సడలడమే. ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.