భారతదేశం, జనవరి 4 -- తెలుగులో లేటెస్ట్‌గా వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం శంబాల. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన శంబాల డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల శంబాల విజయోత్సవం పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ డైరెక్టర్ వశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో విశ్వంబర డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ .. "సాయి కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో హిట్టు కొట్టారు. ఆది ఏడాది చివర్లో హిట్ కొట్టారు. 'శంబాల' టీజర్, ట్రైలర్ చూసి ఇది నా జోనర్ కదా? అని అనుకున్నాను. 'శంబాల' మూవీ చూసి నేను షాక్ అయ్యాను" అని అన్నార...