భారతదేశం, సెప్టెంబర్ 10 -- అమరావతి వేదికగా నిర్వహించిన 8వ కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఫైళ్లు పెండింగ్‌లో పడితే రాష్ట్ర ప్రగతి, పాలన కూడా నిలిచిపోయినట్టేనని స్పష్టం చేసిన సీఎం, అధికారులు ఇగోలు పక్కనపెట్టి ప్రజాసేవకులుగా బాధ్యతలు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. సమీక్ష సమావేశాలకే పరిమితం కాకుండా ఫలితాలు సాధించడమే ధ్యేయంగా పనిచేయాలని, వన్‌ స్టేట్‌ - వన్‌ మిషన్‌ - వన్‌ ఎయిమ్‌ సిద్ధాంతంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధనకు కట్టుబడి ఉండాలని అధికారులను ఆదేశించారు.

పరిపాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు కలెక్టర్ల సమావేశంలో తొలిసారిగా లీడర్‌షిప్‌ స్కిల్స్‌పై ప్రత్యేక సెషన్‌ను నిర్వహించారు. రియాక్టివ్ పాలన కంటే ముందుచూపుతో కూడిన ప్రోయాక్టివ్ పాలన ప్రాధాన్యమైనదని సీఎం చంద...