భారతదేశం, మార్చి 5 -- రాష్ట్రవ్యాప్తంగా కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయనగరంలో వేణుగోపాలపురం వద్ద 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణంపై సభ్యులు అదితి విజయలక్ష్మీ గజపతిరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు వేణుగోపాలపురం 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం రీ టెండరింగ్ ప్రక్రియలో ఉందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

'ప్రాజెక్టులు పూర్తికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని పని చేస్తున్నాం. వేణుగోపాలపురం సబ్ స్టేషన్ నిర్మాణం మార్చి 2027 నాటి పూర్తి చేస్తాం. విజయనగరానికి అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఖర్చుతో కూడుకున్నది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ ...