భారతదేశం, అక్టోబర్ 27 -- ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల వివాదంపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. నామినేషన్ల గడువును పొడిగించాలని, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని వైసీపీ కోరిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనితో ఈ వ్యవహారంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి నిరాశే ఎదురైంది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తుది నిర్ణయం వెలువరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "ఎన్నికలను వాయిదా వేయాలనే మీ ఉద్దేశం లేదా ట్రాప్‌లో మేం పడబోం" అని ధర్మాసనం స్పష్టం చేసింది. నామినేషన్ల సమయం ఇప్పటికే ముగిసినందున విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. "ఇ...