ఇంద్రకీలాద్రిపై వైభవంగా నవరాత్రులు.. లలితా త్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ దర్శనం!
భారతదేశం, అక్టోబర్ 15 -- విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం నాడు జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా, పంచదశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా కొలువొందే శ్రీ లలితా దేవి రూపాన్ని దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా.. చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరకుగడ చేతిలో పట్టుకొని ఉంటుంది. శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయానికి పరమేశ్వరుడు మహా కామేశ్వరుడిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.