ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు.. బాలాత్రిపురసుందరిదేవిగా అమ్మవారు
భారతదేశం, అక్టోబర్ 11 -- విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారుల వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల సమయానికి మొత్తం 17,576 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆలయ యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. అన్ని క్యూ లైన్ల ద్వారా ఉచిత దర్శన సదుపాయం కల్పించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన పూజా మండపంలో కుంకుమార్చన కార్యక్రమాలు ప్రారంభం కాగా, సంప్రదాయబద్ధంగా యాగశాలలో చండీ హోమానికి సంబంధించిన ప్రాథమిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ రోజున జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆలయ ఛైర్మన్, కార్యనిర్వహణాధి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.