ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్స్.. వన్ టైమ్ క్లియరెన్స్, వారికి మంజూరైనా క్యాన్సిల్
భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం తొలగించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సానుకూలంగా పరిగణనలోకి తీసుకున్నట్టుగా పొంగులేటి చెప్పారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్లో ఇప్పటికే మంజూరై బేస్మెంట్ లేదా అంతకంటే పై స్థాయికి చేరుకున్న ఇళ్లకు L3 నుంచి L1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి (One-time Clearance) ఇస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించిందని మంత్రి పొం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.