భారతదేశం, జూలై 1 -- విమాన ప్రయాణికులకు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో తీపి కబురు అందించింది. లగేజీ లేకుండా కేవలం హ్యాండ్ బ్యాగుతో (కేబిన్ బ్యాగేజీ) ప్రయాణించే వారి కోసం తక్కువ ధరకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం 'ఇండిగో లైట్' (IndiGo Lite) పేరిట సరికొత్త కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. విమాన ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చడంతో పాటు, సేవలను విడివిడిగా అందించి టికెట్ ధరలను తగ్గించే వ్యూహంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

జూలై 1 నుంచి ఈ టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూలై 15 నుంచి ఈ టికెట్ల ద్వారా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ రూట్లలోనూ ఈ 'ఇండిగో లైట్' టికెట్లు అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఇండిగో అధికారిక యాప్ లేదా...