భారతదేశం, జూన్ 12 -- ఇంట్లో తయారుచేసే అనేక రకాల వంటకాలలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఉపయోగిస్తాం. ఇక నాన్ వెజ్‌లో కాస్త గట్టిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను దట్టిస్తాం. పచ్చి వాసనను తొలగించి, రుచిని పెంచడానికి అల్లం-వెల్లుల్లి పేస్ట్ చాలా అవసరం. అందువల్ల, అల్లం వెల్లుల్లి లేకుండా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఏ వంటకం చేయరేమో. ఈ రెండు సహజ పదార్థాల కలయిక వంటకు అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టులు కల్తీ ఎక్కువ. దీంతో ఇంట్లోనే చేసుకంటే మంచిది. కానీ సమస్య ఏంటంటే, ఇంట్లో తయారుచేసిన ఇలాంటి పేస్టులు కొన్ని రోజుల తర్వాత వాసన రావడం మొదలవుతాయని చాలా మంది కంప్లైంట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేయాలి?

రెండు కప్పుల వెల్లుల్లి (పొట్టు తీసినవి), అర కప్పు...