భారతదేశం, మే 14 -- తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ద్వితీయ సంవత్సరంలోనే ఉండే ప్రాక్టికల్స్ (ప్రయోగాత్మక పరీక్షలు), ఇకపై మొదటి సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. కేవలం సైన్స్ గ్రూపులకే కాకుండా.. మ్యాథ్స్, హ్యుమానిటీస్ (ఆర్ట్స్) విద్యార్థులకు కూడా కొత్త అసెస్‌మెంట్ విధానాన్ని అమలు చేయనుంది.

ఇకపై ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ప్రాక్టికల్స్‌ను రెండు ఏళ్లూ నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టులో ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు ప్రాక్టికల్స్ కోసం కేటాయించారు. అంటే ప్రయోగాల ద్వారా మార్కులు సాధించే అవకాశం విద్యార్థులకు పెరుగుతుంది.

మ్యాథ్స్ పరీక్షా విధానంలోనూ భారీ మార్పు వచ్చింది. థియరీ కంటే 'యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్'కు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఉన్...