భారతదేశం, జూలై 6 -- తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి(TGBIE) రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. సైన్స్ గ్రూపుల (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) ప్రాక్టికల్ పరీక్షల సరళిని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ సరికొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. నూతన విధానం ప్రకారం ఇకపై ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు విడివిడిగా ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. అంటే ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయి.

గతంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఈ విధానాన్ని మార్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు ఇంటర్ ప్రథమ సంవత్సరం 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ మార్కులు ఉంటాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం కూడా 15 మార్కుల ...