భారతదేశం, ఫిబ్రవరి 21 -- టాలీవుడ్ తెలుగు హీరోయిన్లలో బ్యూటిపుల్ శివాని నాగరం ఒకరు. సుహాస్ హీరోగా తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో శివాని నాగరం బాగానే క్లిక్ అయింది. అనంతరం కొంచెం గ్యాప్ తర్వాత లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటి.

లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయనిగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది శివాని నాగరం. ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి సుహాస్‌తో జత కట్టి శివాని నాగరం నటించిన సినిమా హే బల్‌వంత్. ముందు ఈ సినిమా పేరు హే భగవంత్‌గా ఉండేది.

పలు అనివార్య కారణాల వల్ల రీసెంట్‌గా ఆ టైటిల్ మార్చి హే బలవంత్‌గా పెట్టారు. సుహాస్ హీరోగా శివాని నాగరం హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు గోపి ఆచార్య దర్శకత్వం వహించారు. న...