భారతదేశం, మే 12 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సవరించింది. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు, కఠిన నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 8 నుంచే ప్రవేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. తాజాగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చు.

నిజానికి ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావించింది. అయితే, ఈ హడావిడి నిర్ణయంపై పలు విద్య...