భారతదేశం, జూన్ 20 -- Singer Rekha Bhardwaj On Namak Ishq Ka Song Omkara: సినిమా పరిశ్రమలో కొన్ని పాటలు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తాయి. అలాంటి వాటిల్లో రెండు దశాబ్దాల క్రితం వచ్చి ప్రేక్షకులను ఊపేసిన 'ఓంకార' చిత్రంలోని 'నమక్ ఇష్క్ కా' సాంగ్ ఒకటి.

బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు తన మాస్ స్టెప్పులతో థియేటర్లలో సెగలు రేపిన ఈ పాట, ప్రముఖ సింగర్ రేఖ భరద్వాజ్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అప్పటివరకు పరిశ్రమలో ఉన్నా రాని గుర్తింపును ఈ ఒక్క సాంగ్ తెచ్చిపెట్టింది. అయితే, మొదట్లో ఈ పాటను పాడేందుకు ఆమె అస్సలు ఇష్టపడలేదనే ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా రేఖ భరద్వాజ్ తాజాగా వెల్లడించారు.

ఈ ఏడాది జూలై నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ఓంకార చిత్రం విలియం షేక్స్‌పియర్ ప్రసిద్ధ నాటకం 'ఒథెల్లో' ఆధారంగా తెరకెక్కింది. డైరెక్టర్, సంగీత దర్శకుడు విశా...