ఆ తప్పు చేశారంటే మీ పీఎఫ్, పింఛన్ రాదు.. ఈపీఎఫ్ఓ హెచ్చరిక
భారతదేశం, ఆగస్టు 4 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన చందాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. పీఎఫ్ ఖాతాలో ఉన్న 'డేట్ ఆఫ్ జాయినింగ్' (ఉద్యోగంలో చేరిన తేదీ - DOJ), 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' (ఉద్యోగం వదిలిన తేదీ - DOE) వివరాలలో తప్పులు ఉంటే భవిష్యత్తులో పింఛన్, పీఎఫ్ సొమ్ము సరిగా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈపీఎఫ్ఓ ఈ సమాచారాన్ని పంచుకుంది. ఉద్యోగ వివరాలు ఖచ్చితంగా ఉండటం ఎంత ముఖ్యమో వివరిస్తూ 10 సెకన్ల వీడియోతో పాటు క్యూఆర్ (QR) కోడ్ను కూడా జత చేసింది.
"మీరు ఉద్యోగంలో చేరిన లేదా మానేసిన తేదీల్లో చేసే చిన్న పొరపాటు కూడా మీ భవిష్యత్తు ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వివరాలు తనిఖీ చేసి, సరిదిద్దుకోండి. మీ పీఎఫ్, పింఛన్ ప్రయోజనాలను సు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.