భారతదేశం, జనవరి 20 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాద మరణ బీమాను రూ.10 లక్షలకు పెంచడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కల్పించింది. జీవనం కోసం పూర్తిగా చేపలు పట్టడంపై ఆధారపడిన కుటుంబాలను రక్షించడం ఈ నిర్ణయం లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) కింద రాష్ట్రం బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచింది. సముద్రంలో చేపలు పట్టేటప్పుడు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఈ మెుత్తం అందుతుంది.

గతంలో కుటుంబాలు రూ.2 లక్షల వరకు పరిహారంగా పొందాయి. అయితే ఈ మొత్తం సముద్ర చేపల వేటలో కలిగే నష్టాలకు సరిపోలడం లేదని ప్రభుత్వం భావించింది. రూ.10 లక్షల బీమా చేపలు పట్టడం సంబంధిత ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సహజ కారణాలు లేదా ఇతర సంఘటనల కారణంగా మ...