ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం: భారతీయ విద్యార్థులకు ఇబ్బందులే
భారతదేశం, సెప్టెంబర్ 17 -- ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను క్రమబద్ధీకరించే క్రమంలో వీసా నిబంధనలను విపరీతంగా కఠినతరం చేసింది. నూతన నిబంధనల ప్రకారం, ఆస్ట్రేలియాకు వచ్చే చాలామంది విదేశీ విద్యార్థులు తమ భాగస్వాములను (Spouse), పిల్లలను వెంట తీసుకురావడానికి అనుమతి నిరాకరించనున్నారు.
ఆస్ట్రేలియా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ ఈ కీలక నిర్ణయాలను వెల్లడించారు. వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని, వర్కింగ్ హాలిడే వీసాదారులకూ కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జనాభా పెరుగుదల, జీవన వ్యయం పెరగడం ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక వలసలను తగ్గించాలని ఒత్తిడి పెరుగుతోంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.