ఆస్ట్రేలియాలో సాయి పేరెంటరల్స్ భారీ ఒప్పందం: రూ.204 కోట్ల డీల్ రెన్యూవల్
భారతదేశం, ఆగస్టు 25 -- హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీడీఎమ్ఓ (CDMO), బ్రాండెడ్ జెనెరిక్స్ సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ అంతర్జాతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని కంపెనీ అనుబంధ సంస్థ 'నూమెడ్ ఫార్మాస్యూటికల్స్ పిటివై లిమిటెడ్', ఆస్ట్రేలియాకు చెందిన మల్టీ-బిలియన్ డాలర్ల దిగ్గజ ఫార్మసీ చైన్‌తో తన ఓటీసీ (OTC) మందుల సరఫరా ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నట్లు ప్రకటించింది.
ఈ నూతన ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుంది. మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఈ ఒప్పందం మొత్తం విలువ 30 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 204.0 కోట్లు) గా అంచనా వేశారు. దీనిప్రకారం ప్రతి ఏటా సరాసరి 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల విలువైన సరఫరా జరుగుతుంది. ఒప్పంద వ్యవధిలో కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, పోర్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.