భారతదేశం, ఏప్రిల్ 21 -- ఈ నెల 22 నుంచి చేపట్టబోయే సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, కాలయాపన కోసమే కమిటీలు వేశారని జేఏసీ ఛైర్మన్ వెంకన్న విమర్శించారు. మెట్రోపై ఉన్న ప్రేమ ఆర్టీసీపై లేదని విమర్శించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న పాలకులు, ఆర్టీసీని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే, మూసీ పునరుజ్జీవనానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని వెంకన్న ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ...