భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజాశ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని అన్నారు.

'సమస్యలకు సమ్మె పరిష్కారం కాదు. కార్మికుల సమస్య పరిష్కారానికి కమిటీ వేశాం. నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలి. 32 అంశాల్లో 29 వెంటనే పరిష్కారం చేసేవి. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దగ్గర చర్చిస్తాం.' అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తోంది. మంగళవారం రాత్రి ఆర్టీసీ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలమవడంతో, బుధవారం ఉదయం ...