భారతదేశం, ఏప్రిల్ 24 -- దేశ రాజధాని రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, ఆ పార్టీ గళంగా ముద్రపడిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా చివరకు కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు. తనతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులను కలుపుకుని కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో విలీనమయ్యారు. ఈ పరిణామం ఆప్ ఉనికిని రాజ్యసభలో ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, పంజాబ్ రాజకీయాల్లో కూడా పెను మార్పులకు నాంది పలికేలా కనిపిస్తోంది.

రాఘవ్ చద్దా తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ 'విలీనం' (Merge) అనే పదాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. దీని వెనుక బలమైన రాజ్యాంగ కారణం ఉంది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం, ఏ పార్టీకి చెందిన సభ్యులైనా వ్యక్తిగతంగా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే వారి పదవి పోతుంది....