ఆధ్యాత్మిక యాత్రల్లో జెన్ జీ బిజిబిజీ.. రెడ్‌బస్ తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు
భారతదేశం, జూన్ 26 -- తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్సిటీ ప్రయాణాలకు, ప్రధానంగా ఆధ్యాత్మిక యాత్రలకు ఆదరణ అమాంతం పెరిగింది. వారాంతపు సెలవులతో పాటు తిరుమలలో జరిగే ప్రతిష్టాత్మక 'జ్యేష్ఠాభిషేకం' ఉత్సవాల నేపథ్యంలో తిరుపతి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'రెడ్‌బస్' (redBus) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి బస్ బుకింగ్స్ గతేడాదితో పోలిస్తే జూన్ 14 నుంచి జూన్ 20 మధ్య కాలంలో 22 శాతం వృద్ధిని నమోదు చేయనున్నట్లు సంస్థ అంచనా వేసింది.
కలియుగ వైకుంఠంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తుతున్నారు. ఇందుకు నిదర్శనంగా 2026 జనవరి నుంచి మే నెలల మధ్య కాలంలోనే తిరుమలలో ఏకంగా 4.4 కోట్లకు పైగా భోజనాలు, పానీయాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.