భారతదేశం, అక్టోబర్ 5 -- ఆధార్ కార్డులో పేరు తప్పుగా పడిందా? లేదా పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్త నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఆధార్‌లో పేరు మార్పులు, సవరణలకు సంబంధించి యూఐడీఏఐ తమ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ని సవరించింది. ఈ సవరించిన నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఇప్పటివరకు ఆధార్ పేరు మార్పుకు అందరికీ ఒకే రకమైన విధానం ఉండేది. కానీ నూతన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారులు కోరే మార్పు రకాన్ని బట్టి వేర్వేరు ధ్రువపత్రాలు, అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు అందజేసే పత్రాలు, అఫిడవిట్లు, గెజిట్ నోటిఫికేషన్ల ప్రామాణికతను యూఐడీఏఐ క్షేత్రస్థాయిలో నేరుగా తనిఖీ చేస్తుంది.

పేరులో స్వల్పంగా స్పెల్లింగ్ తప్పులు ఉన్నప్పుడు లేదా ఉచ్ఛారణ పరంగా చిన్న చిన్న తేడాలు ఉన్నప్పుడు దానిని 'మైన...