భారతదేశం, ఆగస్టు 31 -- ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిధిలో ఉన్న పాలిటెక్నిక్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సవరించిన ప్రకటన విడుదలైంది. పూర్తిగా ఒప్పంద (కాంట్రాక్ట్/తాత్కాలిక) ప్రాతిపదికన 11 నెలల కాలపరిమితి కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులకు 07.09.2026న వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

టీచింగ్ అసోసియేట్ - 1 పోస్టు కోసం నోటిఫికేషన్ వెలువడింది. వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్‌డి లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. మాస్టర్స్ అభ్యర్థులకు సంబంధిత రంగంలో బోధన/పరిశోధన అనుభవం, రీసెర్చ్ పేపర్ ప్రచురణ లేదా నెట్ అర్హత ఉండాలి. డిగ్రీలు ఐసీఏఆర్(ICAR) గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పొంది ఉ...