ఆగస్టు 7న నేతన్న సేవలో పథకం ప్రారంభం.. రూ.25,000 ఆర్థిక సాయం.. ఆగస్టు 5లోపు అప్లై చేయండి
భారతదేశం, ఆగస్టు 3 -- చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు రెడీ అయింది. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక ఊరట కలిగించేందుకు 'నేతన్న సేవలో' పథకాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న బాపట్ల జిల్లా చీరాల వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం నేరుగా అందనుంది. చేనేత రంగాన్ని పునరుద్ధరించడం, నేతన్నలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
'నేతన్న సేవలో' పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చేనేత, జ్యూట్ శాఖ మంత్రి ఎస్.సవిత సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జ్యూట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.