భారతదేశం, ఆగస్టు 7 -- వర్షాలు సమృద్ధిగా కురిసి, జలాశయాలు జలకళతో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతాంగం సంతోషంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని కోరుకుంటూ నాగార్జునసాగర్ వేదికగా మహా వరుణ యాగం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సూచనల మేరకు ఆగస్టు 10వ తేదీన ఈ వేద క్రతువును అత్యంత వైభవంగా చేపట్టేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌ విజయ విహార్ ప్రాంగణం ఈ మహా యాగానికి వేదిక కానుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన ప్రధాన వేద పండితులు, అర్చకుల పర్యవేక్షణలో ఈ యాగం సాగనుంది. వర్షభావానికి కారణమయ్యే ఎల్-నినో ప్రతికూల ప్రభావాలు రాష్ట్రంపై పడకుండా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ యాగ క్రతువును రూపకల్పన చ...