భారతదేశం, జూన్ 15 -- గత 8 నెలలుగా వరుస తిరస్కరణలు.. దరఖాస్తు చేయడమే వదిలేద్దాం అనుకున్న దశలో ఒకే ఒక్క అవకాశం.. వైష్ణవి రామలింగం జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ప్రపంచంలోనే అత్యున్నత విద్యాసంస్థ అయిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి దాదాపు రూ. 2 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ అందుకొని ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పారు.

తనకు స్కాలర్‌షిప్ వచ్చినట్లు ఈమెయిల్ చూసిన క్షణంలో తను పొందిన ఆనందాన్ని, ఎమోషన్‌ను వైష్ణవి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ వీడియోపై "మొదటి తరం గ్రాడ్యుయేట్ అయిన నేను, ఆక్స్‌ఫర్డ్‌లో దాదాపు రూ. 2 కోట్ల విలువైన పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ గెలుచుకున్నానని తెలిసిన క్షణం" అని రాసుకొచ్చారు.

"గత 8 నెలలుగా నేను ప్రయత్నించిన ప్రతి ఒక్కటీ రిజెక్షన్‌తోనే ముగిసింది. కానీ నేను అస్సలు ఊహించని, నా మనసుకు అత్యంత ఇష్టమైన ఒక...