భారతదేశం, జూలై 27 -- పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామలయం నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వ భూమిలో ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ ప్రాజెక్టుపై ఏవైనా సరైన అభ్యంతరాలు ఉంటే, కొత్తగా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఆ ప్రదేశంలో 80 ఏళ్లకు పైగా రామ మందిరం ఉన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయని, ఆకివీడులో రామలయం నిర్మాణానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ వివాదానికి సంబంధించి.. గతంలో జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం చట్టబద్ధమైనదేనని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు లోబడి ఆలయ నిర్మాణం చేపట్టడంలో ఎలాంటి తప్పులేదని వెల్లడించింది. ఆలయ నిర్మ...