భారతదేశం, జూలై 10 -- ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నం - పూరీ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ట్రెయిన్ నెంబర్ 08551/08552 పరిధిలో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు ఖుర్దా రోడ్ జంక్షన్‌ను బైపాస్ చేస్తూ, అరుగుల్, హరిపూర్‌గ్రామ్ మీదుగా నడుస్తాయి. రైల్వే శాఖ ప్రకటన ప్రకారం ఈ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు వైపులా రెండేసి ట్రిప్పుల చొప్పున వెళ్తాయి.

ట్రైన్ నెంబర్ 08551 (విశాఖపట్నం - పూరీ) రైలు జూలై 15, 2026 నుంచి జూలై 23, 2026 తేదీలలో సర్వీసులను అందిస్తుంది.

ట్రెయిన్ నెంబర్ 08552 (పూరీ - విశాఖపట్నం) తిరుగు ప్రయాణం...