ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల షెడ్యూల్ మార్పు.. MPTC, ZPTC పోలింగ్, లెక్కింపు తేదీలు ఇవే
భారతదేశం, అక్టోబర్ 28 -- ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. ఇదివరకు ప్రకటించిన పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలను సవరిస్తూ బుధవారం అధికారికంగా కొత్త షెడ్యూల్‌ను వెలువరించింది.
మొదటి షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3న పోలింగ్, 5వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉంది. కొత్త షెడ్యూల్ ప్రకారం పోలింగ్ తేదీ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 7వ తేదీకి మార్చింది ఎన్నికల సంఘం. ఇటీవల పట్టణ స్థానిక సంస్థల (మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు) ఎన్నికల తేదీలను సైతం ఎన్నికల సంఘం సవరించిన సంగతి తెలిసిందే.
పట్టణ పోలింగ్‌ను అక్టోబర్ 28 నుంచి వచ్చే నవంబర్ 1వ తేదీకి, ఓట్ల లెక్కింపును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 3న మునిసిపల్ ఎన్నికల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.