భారతదేశం, ఫిబ్రవరి 14 -- శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం... నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఉంటుంది. ఈ అధ్యాత్మిక క్షేత్రానికి దశాబ్దాల కాలం నుంచి ఎంతో పురాతనమైన ప్రాశస్యత నేపథ్యం ఉంది. అశ్వత్థామ మహర్షి చేత ప్రతిష్టించబడిన స్వయంభూ శివలింగ క్షేత్రంగా గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత, పురాతన నేపథ్యం ఉంది.

ఏడాదిలో కేవలం శివరాత్రి పర్వదినాల్లో అంటే రెండు రోజులు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అది కూడా అటవీశాఖ అనుమతి ఇస్తేనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏడాది పులుల లెక్కింపు కారణంగా అటవీశాఖ రాకపోకలకు అనుమతులు ఇవ్వలేదు. అయితే మంత్రి ఫరూక్ ప్రత్యేకంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందిన ఆయన.. అధికారులకు ఆదేశాలిచ్చారు.

నాగా...