భారతదేశం, అక్టోబర్ 12 -- ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరం మెుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులతో పాటు, 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా రొటేషన్ పద్ధతిలో ఈ కేటాయింపులు పూర్తి చేశారు.

రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, జనరల్ మహిళలకు 5, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కింద 4 స్థానాలను కేటాయించారు.

ఎస్టీ - మంగళగిరి - తాడేపల్లి

ఎస్సీ - రాజమహేంద్రవరం, కర్నూలు

బీసీ మహిళ- మచిలీపట్నం, కాకినాడ

బీసీ జనరల్- ఏలూరు, అనంతపురం, చిత్తూరు

జనరల్ మహిళ - గ్రేటర్ విశాఖపట్నం, గుంటూరు, విజయనగర...